కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు రావడం జరిగింది. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలని పొందొచ్చు. మీరు కూడా ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని చూస్తున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి చూడాల్సిందే. ఈ స్కీమ్ లో చేరడం వల్ల ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. అదే అటల్ పెన్షన్ యోజన స్కీమ్.
ఈ స్కీమ్ తో నెలకు రూ. 5000 వరకు పొందొచ్చు. ఈ స్కీమ్ లో చేరితే కనీసం రూ. 1000 పెన్షన్ వస్తుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు వయస్సు వారు ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు. 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా రూ. 5 వేల వరకు పెన్షన్ ని ఈ స్కీమ్ తో పొందవచ్చు. మీరు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను చెల్లింపుదారులు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు. ఈ స్కీమ్ లో ఆటో డెబిట్ ఫీచర్ ఉంది. 18 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.1000 పొందాలని భావిస్తే నెలకు రూ. 42 కట్టాలి. రూ. 2 వేల కోసం రూ. 84, రూ. 3 వేల కోసం రూ. 126, రూ. 4 వేల కోసం రూ. 168, రూ. 5 వేల కోసం రూ. 210 చొప్పున పే చెయ్యాల్సి వుంది.
25 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ. 1000 పెన్షన్ తీసుకోవాలని అనుకుంటే నెలకు రూ. 76 కట్టాలి. 40 ఏళ్ల వయసు వారు రూ. 1000 కోసం నెలకు రూ. 291 చెల్లించాల్సి వుంది. రూ. 2 వేల కి రూ. 582 కట్టాలి. రూ. 3 వేల కోసం రూ. 873 చెల్లించాలి. రూ. 4 వేల కోసం రూ. 1164 కట్టాలి. రూ. 1454 కడితే రూ.5 వేలను పొందొచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణిస్తే భాగస్వామికి పెన్షన్ అందిస్తారు.