బాసర ట్రిపుట్ ఐటీ కాలేజీలో నెలకొన్న సమస్యలను పరిష్కించాలని కోరుతూ విద్యార్థులు గత ఆరు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం స్పందిచకపోవడంతో బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు జాగరణ దీక్ష చేపట్టారు. ఇదే సమయంలో విద్యార్థులతో జిల్లా కలెక్టర్ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. రెండు గంటల పాటు చర్చలు జరిపినా ఆందోళనల విరమణకు విద్యార్థులు ససేమిరా అన్నారు.
సీఎం రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే తరగతులకు హాజరైతే హామీ ఇప్పిస్తానని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు. హామీ పత్రం లేకుండా నిరసన విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. 12 డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని విద్యార్థులు పట్టుబట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు గొడుగులు పట్టుకుని ఆరవ రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు.