చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. ఎక్కువమంది ఎదుర్కొనే సమస్యల లో హై కోలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడేవాళ్లు డైట్ లో ఈ డ్రింక్స్ ని తీసుకుంటే మంచిది వీటిని తీసుకోవడం వలన ఆరోగ్య బాగుంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అయితే మరి డైట్ లో ఎటువంటి వాటిని తీసుకోవాలి అనేది చూద్దాం వీటిని కనుక మీరు మీ డైట్ లో చేర్చుకుంటే కచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి.
గ్రీన్ టీ:
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని మీరు డైట్ లో తీసుకోవడం వలన హై కొలెస్ట్రాల్
లెవెల్స్ తగ్గుతాయి. అలానే బ్లాక్ టీ ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇది కూడా హై కొలెస్ట్రాల్
లెవెల్స్ ని తగ్గిస్తుంది.
కోకో డ్రింక్స్:
450 మిల్లీగ్రాముల కోకో కలిగిన డ్రింక్స్ ని మీరు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
బెర్రీ స్మూతీస్:
బెర్రీస్ లో చక్కటి గుణాలు ఉంటాయి బెర్రీస్ కలిగిన స్మూతీస్ ని మీరు తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
సోయ్ మిల్క్:
సోయ్ మిల్క్ ద్వారా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. హై కొలెస్ట్రాల్
లెవెల్స్ తో బాధపడే వాళ్ళు తప్పక చేర్చుకోండి.
టమాట జ్యూస్:
ఇది కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది కాబట్టి దీనిని డైట్ లో చేర్చుకుని ప్రయోజనాలని పొందండి. దానితో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.