Kisi Ka Bhai Kisi Ki Jaan : సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట

-

బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ పెరిగిపోయింది. ఇకే కేజీఎఫ్, కాంతార మూవీస్​తో మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీపై క్రేజ్ పెరిగింది. అందుకే బాలీవుడ్ దర్శక నిర్మాతలు.. సౌత్ సినిమాలు రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

రీమేక్​ సినిమాలతో కూడా వంద కోట్లు ఈజీగా వసూల్ చేయొచ్చని నిరూపించాడు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్. తాజాగా ఈ కండలవీరు తమిళ సినిమా వీరమ్.. తెలుగు మూవీ కాటమరాయుడును హిందీలో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఫర్హద్ సాంజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే సల్మాన్ జంటగా నటిస్తోంది. వెంకటేశ్, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటించిన ఈ హిందీ చిత్రం రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో తెలంగాణ సంప్రదాయంలో ఒకటైన బతుకమ్మ పాటను జోడించారు. హిందీ చిత్రంలో తెలుగు పాట రావడం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. వెంకటేశ్, భూమికా, పూజా హెగ్డే ప్రధాన పాత్రధారులపై చిత్రీకరించిన బతుకమ్మ పాటలో సల్మాన్ ఖాన్ కూడా మెరవడం విశేషం. అలాగే ఈ పాటకు KGF ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతాన్ని అందించడం మరో విశేషం.

 

Read more RELATED
Recommended to you

Latest news