కరోనా ఇంకా పోలేదు..జాగ్రత్తలు పాటించకపోతే చస్తారు : తెలంగాణ ఆరోగ్య శాఖ

-

తెలంగాణ కరోనా కేసులపై రాష్ట్ర వైద్య శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసులు గత మూడు నెలల నుండి తగ్గుముఖం పట్టిందని… రికవరీ రేటు చాలా పెరిగిందని పేర్కొంది. నార్మల్ లైఫ్ లోకి వస్తున్నామని… ప్రస్తుతం పండగ సీజన్ మొదలైంది…రానున్న మూడు నెలలు పండగ సీజన్ అని వెల్లడించింది ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు కరోనా బారిన పడని వారు… ఇప్పుడు జాగ్రతలు పాటించక పోతే కరోనా కు బలి అవుతారని హెచ్చరించింది.

రీసెంట్ గా 17 ఏళ్ల అమ్మాయి కరోనా బారిన పడి చనిపోయిందని… ఇంకా కరోనా మొత్తం పోలేదు…జాగ్రతలు తప్పనిసరి తీసుకోవాలని సూచించింది ఆరోగ్య శాఖ. పండగలు, విందులు, షాపింగ్ చేసేటప్పుడు జాగ్రతలు తప్పనిసరి అని వెల్లడించింది.

ఫ్యామిలీ లో ఒకరు కరోనా బారిన పడితే మిగతా అందరూ కరోనా బారిన పడుతున్నారని… ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి…లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచనలు చేసింది. పండగ సీజన్ కాబట్టి…అవసరమైతే నే ప్రయాణాలు చేయాలని హెచ్చరించింది. డిసెంబర్ వరకు మరింత జాగ్రతలు తప్పనిసరి అని స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ. రెండు డోస్ లు తీసుకుంటేనే సురక్షితమని పేర్కొంది ఆరోగ్యశాఖ.

Read more RELATED
Recommended to you

Latest news