ఈసారి మినీ ఐపీఎల్‌..? 8 జట్లు 2 గ్రూప్‌లలో మ్యాచ్‌లు..?

-

కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి 29వ తేదీ నుంచి జరగాల్సిన ఐపీఎల్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 15 వరకు ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తాజాగా తెలిపింది. కాగా ఆ తరువాతైనా ఐపీఎల్‌ నిర్వహించాలా, వద్దా అన్న విషయంపై శనివారం ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులు బీసీసీఐతో చర్చించారు. దీంతో ఐపీఎల్‌ ఈ సారి మినీ ఐపీఎల్‌గా మారుతుందని తెలిసింది.

bcci might conduct mini ipl this time with 2 groups 8 teams

ఈ సారి ఐపీఎల్‌ను గతంలో మాదిరి కాకుండా 8 జట్లను 2 గ్రూపులుగా విభజించి ఆడిస్తారని తెలుస్తోంది. ఇక రెండు గ్రూపుల్లోనూ మొదటి రెండు స్థానాల్లో నిలిచే 4 జట్లతో ప్లే ఆఫ్స్‌ ఆడించాలని చూస్తున్నట్లు సమాచారం. అలాగే వారాంతాల్లో రెండు మ్యాచులు నిర్వహించాలని, ఆటగాళ్లు, అధికారులు, టీవీ, మైదానం సిబ్బంది ఎక్కువ ప్రయాణించే అవసరం లేకుండా కేవలం 2 లేదా 3 వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే తక్కువ వ్యవధిలోనే 60 మ్యాచులను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని కూడా అనుకుంటున్నట్లు తెలిసింది.

అయితే విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించాలనే ఆలోచన తమకు లేదని బీసీసీఐ అధికారులు తెలిపారు. అందువల్ల భారత్‌లోనే ఈ సారి ఐపీఎల్‌ జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఐపీఎల్‌ కన్నా ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులు బీసీసీఐకి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మినీ ఐపీఎల్‌ జరుగుతుందా, లేదా అన్నది త్వరలో తేలనుంది..!

Read more RELATED
Recommended to you

Latest news