ప్రస్తుతం ప్రపంచ దేశాలను మహమ్మారి కరోనా వైరస్ లేదా కోవిడ్-19 వణికిస్తోంది. ఈ వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో “కరోనావైరస్”గా గుర్తించారు. ఇక అప్పటి నుంచీ కరోనా ఏ రేంజ్‌లో విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక రంగం కుదేలవుతోంది. అంతేకాదు ప్రపంచ దేశాలు మధ్య ఎగుమతులు, దిగుమతుల మందగించాయి.
మరోవైపు నాన్ వెజ్ ద్వారా కరోనా వ్యాపిస్తుందని వదంతులు వ్యాపించడంతో..ఎందుకైనా మంచిదని ప్రజలు మాంసం షాపులవైపు చూడటమే మానేశారు. దీంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బర్త్ ప్లూ వల్ల కోళ్ళు వేల సంఖ్యలో చనిపోవడంతో ప్రజల్లో భయం మరింత పెరిగిపోయింది. అయితే కరోనా కోళ్ల వల్ల రాదని పలువరు నిపుణులు, రాజకీయ నాయకులు, సినీ తారలు చెబుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
మరికొన్ని ఏరియాల్లో కేజీ చికెన్ రూ.10 నుంచి రూ. 50 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. అయితే తమిళనాడులోని తిరువల్లూరులో కొత్త హోటల్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఇక కరోనా భయంతో కస్టమర్లు పెద్దగా హోటల్‌కి రాకపోవడంతో ఆయన ఓ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించారు. రూ. 1కే ధమ్ బిర్యానీ, రూ. 3కే నాటుకోడి చికెన్‌తో పరోటాను అందించారు. దీంతో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. చివరకు రాత్రి వరకు వస్తుందనుకున్న భోజనం మధ్యాహ్నం 2 గంటలకే అయిపోయింది.
c