బీసీజీ వ్యాక్సిన్ కరోనా రాకుండా ఆపలేదు, మేమే చెప్తాం ఆగండి…!

-

కరోనా వైరస్ చికిత్స లేదా నివారణ కోసం బాసిల్ కాల్మెట్-గురిన్ (బిసిజి) టీకాలు తాము సిఫారసు చేయడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ -19 చికిత్సలో బిసిజి వ్యాక్సిన్ వినియోగంపై అడిగిన ప్రశ్నకు గానూ ఐసిఎంఆర్ చీఫ్ డాక్టర్ ఆర్ గంగాఖేద్కర్ మాట్లాడుతూ… మరిన్ని కచ్చితమైన ఫలితాలు వచ్చే వరకు తాము దాన్ని స్పష్టంగా చెప్పలేమని అన్నారు.

“ఐసిఎంఆర్ వచ్చే వారం ఒక అధ్యయనాన్ని ప్రారంభిస్తుంది. దీని నుండి మాకు ఖచ్చితమైన ఫలితాలు వచ్చేవరకు, ఆరోగ్య కార్యకర్తలకు కూడా తాము దీన్ని సిఫారసు చేయమని ఆయన పేర్కొన్నారు. బిసిజి వ్యాక్సిన్ వాడకాన్ని ప్రస్తావించిన ఆయన… ఇది క్షయవ్యాధి రాకుండా ఆపుతుంది. ఇది మెనింజైటిస్‌ను ఆపివేస్తుందని అన్నారు. కాబట్టి ఇది పాక్షిక రక్షణ మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు.

బిసిజి వ్యాక్సిన్ గరిష్టంగా 15 సంవత్సరాలు రక్షిస్తుందని చెప్పారు. పునర్వినియోగం చేయవలసి వస్తే, అది కౌమారదశలోనే చేయాలని అన్నారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీని విషయంలో స్పష్టంగా ఏ విషయం చెప్పడం లేదు. కరోనాకు హైడ్రోక్లోరిక్విన్ మాత్రమే సరిగా పని చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా మన దేశంలో 1920 నుంచి బీసీజీ వ్యాక్సిన్ క్షయ రాకుండా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news