బయట ప్యాకేజ్డ్ ఫుడ్ కొంటున్నారా ? తస్మాత్ జాగ్రత్త !

-

ఈ మధ్య కాలంలో ప్యాకేజ్డ్ ఫుడ్ మీద జనాల్లో క్రేజ్ పెరిగింది. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన కొన్ని రైడ్స్ లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో హల్దీరామ్ పేరుతో  డేట్ ఎక్స్ పైర్ అయిన వాటిని డేట్ మారుస్తూ  తిను బండారాలు విక్రయిస్తున్న హల్దీరామ్ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మి నారాయణ లంగర్ హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గోదాంలో నిల్వ ఉంచుతూ తిను బండారాలు విక్రయిస్తున్నారని గుర్తించారు. డేట్ అయిపోయిన వాటిని డేట్ మారుస్తూ తిను బండారాలు వస్తువులు మార్కెట్లో సేల్ చేస్తున్నారని తేలింది.

టిన్నర్ తో డేట్ తొలగించి కొత్త డేట్ క్రియేట్ చేసి లేటెస్ట్ గా  మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 1 లక్ష 50 వేల విలువ చేసే తినుబండారాలు స్వాధీనం చేసుకున్నారు. జె శ్రీరామ్ ఏజెన్సీ ద్వారా డేట్ అయిపోయిన వాటిని మార్కర్ తో మారుస్తూ తాజా వస్తువులుగా చెలామణి చేస్తున్నారని గుర్తించారు. కరోనా ఎఫెక్ట్ తో నష్టం రావడంతో డబ్బులకు ఆశపడి లక్ష్మి నారాయణ ఈ విధంగా డేట్ మారుస్తూ తిను బండారాలు వస్తువులు మార్కెట్లో సేల్ చేస్తున్నారని హల్దీరామ్ కంపెనీకి కూడా ఈ విషయం తెలియదని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news