బ్యూటీ స్పీక్స్ : అందాల జేజేమ్మకు అభినందిస్తూ రాయున‌ది..

-

చిరుతో పాదం క‌లిపింది.. బాల‌య్య‌తో చిందేసింది.. రాకాసి అని అనిపించుకుంది మ‌హేశ్ తో! ఏం చేసినా కూడా అంద‌రితోనూ సెబ్బాస్ అనిపించుకుంది. ఏదేమ‌యినా త‌న అందంతోనే ఝుంఝుంమాయ చేసింది. కుర్ర‌కారుకు కంటిపై కునుకు అన్న‌దే లేకుండా చేసింది. ఆ విధంగా అనుష్క స‌మ్ థింగ్ స్పెష‌ల్..అవును! ఎన్ని రోల్స్ చేసినా వేదం స‌రోజాగానే మ‌రింత గుర్తు పెట్టుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది.

మ‌గాడి పైశాచికం కార‌ణంగా ఒంటి మీద గాయాల‌ను దాచుకునే పాత్ర‌లో అద్భుతంగా న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. రుద్ర‌మ‌దేవి లాంటి ధీర పాత్ర‌ల‌తో త‌న ఇమేజ్ ఇంకొంచెం పెంచుకుని ప్ర‌యోగాత్మ‌క‌, చారిత్ర‌క పాత్ర‌ల‌కు తన‌కు తానే సాటి అని నిరూపించుకుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో! ఆన్ స్క్రీన్ పై అనుష్క చేసిన అల్ల‌రి ఎంతో!

ఇవాళ ప్ర‌పోజ్ డే..నిన్న రోజ్ డే..అంటే నిన్న‌టి పండుగ‌నూ,ఇవాళ్టి వేడుక‌నూ క‌లిపి ఒకేసారి అనుష్క‌ను గ్రీట్ చేసొద్దాం రండి! అవును! అనుష్క అంటే మిర్చి లాంటి అమ్మాయి..అనుష్క అంటే మ‌నకు బాగా న‌చ్చిన సోయ‌గం..మ‌న‌సుకు న‌చ్చిన అందం.

 

మ‌న‌కు బాగా న‌చ్చిన అభిన‌యం!సాహ‌స పాత్ర‌ల‌కు చిరునామాగా నిలిచిన వైనం! అంతేనా! అందాల అనుష్క అంటే మంచి వ్య‌క్తిత్వం ! అందాల అనుష్క అంటే అభిన‌యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం ! ఇలా ఎన్నింటికో!

 

నేస్త‌మా నేస్త‌మా నువ్వే కోయిలై వ‌చ్చి వాలింది తోట‌లా మార‌నా నీ కోసం అంటూ పాడుతున్న సంద‌ర్భం ఇది. న‌వ్వులు చిందిస్తూ, వెన్నెల పోగేస్తూ ఆమె వ‌స్తుంటే పండ‌గ సంతోషాలు అందుకున్న వైనమిది. ఆ సంద‌ర్భంలో ఓ నంద‌న వ‌నం తార‌సిల్లుతోంది. బెంగ‌ళూరు సోయ‌గంతో పోటీ ప‌డుతోంది. తెలుగింటి అందాల‌ను త‌ల‌పించే విధంగా అంద‌రినీ అల‌రిస్తూ న‌వ్విస్తూ త‌న‌దైన అభినయంతో ఆకట్టుకున్న సంద‌ర్భం ఒక‌టి మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుకువ‌స్తోంది. అన్న‌ట్లు ఇవాళ అనుష్క‌కు ప్ర‌పోజ్ చేద్దాం.. ల‌వ్ యూ స్వీటీ..

నువ్వు రెడీ నేను రెడీ గానా బ‌జాన‌ బ్యాండు రెడీ అంటూ చాలా హంగామా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆమె సూప‌ర్ సినిమా నుంచి అందాల విందు అందిస్తూనే ఉంది. ఆనందాలకు ఆమె ఆన‌వాలు అయి ఉంటూనే ఉంది. అరుంధ‌తితో జేజేమ్మ‌గా జ‌న నీరాజ‌నాలు అందుకుంటూనే ఉంది. అందుకే అనుష్క పేరుకు బెంగ‌ళూరు అమ్మాయి అయినా మ‌నంద‌రికీ ఇష్ట‌మ‌యిన న‌టిగా అభిమాన హృద‌యాల్లో స్థిర స్థానం ద‌క్కించుకుంది. అందాల దేవ‌సేన‌గా ఇంకా పేరు తెచ్చుకుంది. త్వ‌ర‌లోనే మ‌రో మంచి పాత్ర‌తో తెలుగు అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధం అవుతోందీ అమ్మ‌డు.

– బ్యూటీ స్పీక్స్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news