కాంట్ సే ఎనీథింగ్ మోర్
సమ్ డిఫెన్సివ్ వాయిస్ ఈజ్ మేడ్ బై మి
ఔను! నాకు ఆమె కన్నీరు తెల్సు. కష్టం తెల్సు.
కొంతకాలం ఇండస్ట్రీ ఆమెను ఐరెన్ లెగ్ అని ముద్ర వేసిందనీ తెల్సు
వీటిని అధిగమించిన తరుణం తెల్సు .,. ఆ అరుణిమా తెల్సు
రండి లవ్ చేద్దాం శివగామిని..
రాఘవుడికి (రాఘవేంద్రరావు కోవెలమూడి) తెల్సు ..కృష్ణవంశీకి తెల్సు .. విశ్వనాథ్ కీ తెల్సు ఎవరి ప్రతిభ ఏంటన్నది.. రాఘవుడు బ్రేక్ ఇచ్చాడు.. విశ్వనాథ్ ఈమె రేపటి తరానికో గొప్ప నటి అని తెలియజెప్పాడు ..కృష్ణవంశీ జీవితం పంచుకుని ఆమెని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఎవరు గ్రేట్ అంతా గ్రేట్ .. ఆఖరికి నేను కూడా.. ఎందుకు కాదు కొన్నేళ్లుగా ఆరాధనపూర్వకంగా ఆమెని ప్రేమిస్తున్నా గనుక.!
దేవుడ్ని నమ్ముతారా .. ఆ.. నమ్ముతా..
ఎందాక కొంతవరకూ ఇదీ నా జవాబు
రమ్య ని అడగండి గురుపీఠం గురించి
సాయి తత్వం గురించి అనర్గళంగా చెబుతారామె..
ఎస్ .. అప్ అప్ క్లోజప్ ఎదురుగా గన్ను లాంటి పిల్ల …అటుగా మా రజనీ .. అంతెత్తు ఠీవితో.. సర్!! నేను మీ ఎదురుగా నా అరిపాదం చూపిస్తూ కూర్చోలేను.. ఫ్యాన్స్ ఒప్పుకోరు.. ఇదీ రమ్య వాదన. మీరు చేయండి …మీరు ఇప్పుడు నీలాంబరి ..రమ్యకృష్ణ కాదు ఓకేనా.. ఇదీ పడయప్పా అదే నరసింహ సిన్మా షూటింగ్‌లో జరిగిన ఓ చిన్నపాటి ఘటన. కట్ ..కట్ ..కట్.. నరసింహ సినిమా విడుదలైంది. రమ్యకు ఎంతో పేరు వచ్చింది. ఈసారి రజనీని మించిపోయింది. రజనీ సర్ ! మంత్రముగ్ధులైపో యారు. ఈ సారి రమ్య అనే కోయిల కూజితం లోకానికి నచ్చింది. అవకాశాలు వెల్లువెత్తాయ్..! గత కాలం చేసిన గాయాలు మానిపోయాయ్!!
అందుకే అంటాను జీవితం ఇది జీవించాలంతే..బాహుబలిలో శివగామి పాత్ర రమ్యని వరించకపోతే.. అబ్బే! అదేం ప్రశ్న.. ఛాన్సే లేదు అని అన్నారెవరో..! ఔను! వరించకుంటే దారి వేరు. వరించింది కదా! అందుకే ఆమె నటన మరో నీలాంబరిని తలపించింది. అందుకే అంటారేమో నాకంటూ ఏ డ్రీమ్ రోల్ లేదు డెడికేషన్ తో వర్క్ చేయడం తప్ప అని..! వహ్! అద్భుతం. అలా అని అదృష్టాన్ని మాత్రమే నమ్ముతారు అని అనుకోవడం మన అవివేకం.. ప్రతిభని, స్వయంకృషిని ఎంతగానో నమ్మి ఈ స్థాయికి చేరుకున్నారామె.
ఎపార్ట్ ఫ్రమ్ దిస్
ఏదేమైనా ఒకమాట చెబుతా మనుషులు దూరంగా ఉన్నంత మాత్రాన దూరమైపోరు అని అంటారామె..! నిజమే కదా!! ఆమె సిల్వర్ స్క్రీన్ కి దూరమైతే రేపటి వేళ ప్రజల మధ్యకు ఓ పొలిటీషియన్ గా రావచ్చు..లేదా మరేదైనా మంచిపని చేయవచ్చు. అంతేకానీ ఇలానే ఉండాలి అన్న నియమాలు ఆమెలో లేవు కృష్ణవంశీలోనూ లేవు మీకూ నాకూ ఉండకూడదు ఓకేనా!! జీవితంలో రిలాక్స్ అవ్వడానికి కాదు బాస్ ఆమెలా రీఛార్జ్ కావడానికి ప్రయత్నించు. తప్పక ఓటమి నీదే సారీ విజయం నీదే!! ఎందుకంటే సక్సెస్ ఈజ్ ఆల్సో ఒన్ కైండ్ ఫెయిల్యూర్..! మళ్లీ ఎందుకంటే అక్కడి నుంచి మరో ఆలోచన చేయనీయదు గనుక. అఫ్ కోర్స్ ఆ ప్రాబ్లమ్ రమ్యకృష్ణవంశీకి లేదు ఉండదు.మీకూ నాకూ కూడా ఉండకూడదు గాక ఉండకూడదు.
ఐ లవ్ శివగామి .. ఐ లవ్ నీలాంబరి .. ఐ లవ్ రమ్యకృష్ణ
అప్పటికీ , ఇప్పటికీ ఆమెలో ఏంటి తేడా అని అడగకండి .. అవన్నీ మీకు మీరుగా తెల్సుకోండి. ఇంకా వీలుంటే నందీనిరెడ్డి (డైరెక్టర్)ని అడగండి.చెబుతారామె.. ఎందుకంటే ఆడాళ్లా నా దగ్గర అసిస్టెంట్ గానా వద్దుబాబోయ్ అన్నారట కృష్ణవంశీ లేదు పెట్టుకో.. అని ఫోర్స్ చేశారట రమ్య.. అలా ఛాన్స్ దక్కించుకున్న నందిని అటుపై డైరెక్టర్‌గా అలామొదలైందితో ప్రూవ్ చేసుకున్నారుగా.. అలానే సెగ ఫిల్మ్ డైరెక్టర్ అంజనా కూడా.. రమ్య ఏమంటారంటే …ఇది మేల్ డామినేటెడ్ సొసైటీనే కాదనను కానీ ఇక్కడ విమెన్ నెగ్గుకు రావడం అన్నది తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది అని..!! నిజమేగా!! మళ్లీ అంటున్నా ఇక్కడ ప్రతిభే ప్రామాణికం. ఎస్ యు షుడ్ ఫేస్ ద సిట్యువేషన్స్ అండ్ సమ్ అన్ – కంఫర్టబులిటీ ఆల్సో!! ఈ ఆదివారం..ఈ ఉదయం .. ఇంకా ఇంకా నేర్చుకోండి. నేనిక చెప్పను. ఎందుకంటే నేనూ నేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నాను గనుక. ఉంటానిక.
– రత్నకిశోర్ శంభుమహంతి