రాష్ట్రం వ్యాప్తంగా కేసీఆర్ సుడిగాలి పర్యటనలు, ఎల్లుండి జనగాంలో పర్యటన.

తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుడిగాలి పర్యటనలకు సిద్దమైనట్లు తెలుస్తుంది..ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుతున్న జిల్లాలో పర్యటనలకు ప్రణాళిలు వేసినట్లు తెలుస్తుంది..ఈ రోజు ధరణి పోర్టల్ ప్రారంభోత్సవంలో భాగంగా మేడ్చల్లో పర్యటించనున్నారు..ఎల్లుండి జనగాం జిల్లాలో పర్యటించనున్నారు..

జనగాం జిల్లా కొడకండ్లలో ఎల్లుండి సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు..మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించనున్నారు..పల్లె పకృతి వనాలను సందర్శించి అక్కడే స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు..ప్రజలతో ముఖ్యంగా రైతులతో ముఖాముఖి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి..రైతు వేదిక నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశాన్ని, ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను రైతులకు వివరించనున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను కార్యక్రమానికి ఆహ్వానించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరుకానున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఘట్టం కీలక దశకు చేరుకోడంతో పాటు త్వరలోనే వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు జరుగుతుండటంతో ఇప్పడు కేసీఆర్‌ జిల్లాల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.