రావు గోపాల్ రావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక సరికొత్త విలనిజాన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈయన ప్రతి సినిమాకు ఒక డిఫరెంట్ రోల్స్ లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మొదటిసారి ఒక రంగస్థలం నటుడుగా తన కెరీర్ ను ప్రారంభించి ఆ తరువాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అలా అడుగు పెట్టిన కొద్దిరోజుల్లోనే నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన అడుగుజాడల్లోనే తన కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
ఆయన మరెవరో కాదు రావూ రమేష్. ఈయన కూడా పలు సినిమాలలో విభిన్నమైన పాత్రలతో తండ్రిని మించి పోయి నటించేలా కనిపిస్తూ ఉన్నారు. రావు గోపాల్ రావు బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆయన కెరియర్ మారిపోయింది అని చెప్పవచ్చు. దీంతో అవకాశాలు వెల్లువడడంతో పాటు ఉన్నత స్థాయి నటుడిగా పేరు పొందాడు. అయితే ఈయన ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ కూడా ఆర్థికంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ట్లుగా సమాచారం.
రావుగోపాలరావు అందరినీ నమ్మి ఆర్థికంగా నష్టపోయారని చివరి రోజులలో.. అనారోగ్య బారిన పడడంతో చికిత్సకు కూడా డబ్బులు లేని పరిస్థితులలో మరణించినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలా 1994 ఆగస్టు 13న చెన్నైలో మృతి చెందారు. ఇక ఆయన తండ్రి మరణించిన తర్వాత అంత్యక్రియలను కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు. అయితే ఆయన సన్నిహితుడైన కేవలం అల్లు రామలింగయ్య, రేలంగి నరసింహారావు.. తదితర తమిళ మిత్రులు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారట. అయితే అంతటి గొప్ప నటుడు ఒక సాధారణ వ్యక్తి లా అంత్యక్రియల జరగడం బాధాకరమని అప్పట్లో ఆయన సన్నిహితులు చాలా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కానీ చెన్నై లో అంత్యక్రియలు జరగడం వల్ల అక్కడికి సినీ ప్రేక్షకులు హాజరు కాలేదని కొంతమంది ప్రముఖులు తెలియజేస్తున్న మాట.