నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. కీలక విషయాలపై చర్చ

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలు మంగళవారం చండీగఢ్‌లో ప్రారంభంకానున్నాయి. మంగళ, బుధవారాల్లో సమావేశాలు కొనసాగునున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. పలు వస్తువుల పన్ను రేట్లలో మార్పులతో పాటు రాష్ట్రాలకు పరిహారంతో పాటు రిజిస్ట్రేషన్‌ నిబంధనల్లో సడలింపులు వంటి అంశాలను జీఎస్టీ కౌన్సిల్‌ పరిశీలించే అవకాశం ఉన్నది. బీజేపీయేతర రాష్ట్రాలు రెవెన్యూ లోటు భర్తీని కొనసాగించాలని డిమాండ్‌ చేసే అవకాశం ఉంది.

Nirmala Sitharaman - Wikipedia

అయితే, కేంద్రం ఆర్థిక పరిస్థితిని పేర్కొంటూ దాన్ని నిలిపివేయాలని భావిస్తున్నది. సెస్‌ వసూళ్లలో తగ్గుదల కారణంగా రాష్ట్రాల నష్ట పరిహార లోటును తీర్చేందుకు కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు రుణం తీసుకుంది. లక్నోలో జరిగిన 45వ కౌన్సిల్ సమావేశంలో రెవెన్యూ లోటుకు రాష్ట్రాలకు పరిహారం ఇచ్చే విధానం జూన్ 2022లో ముగుస్తుందని సీతారామన్ ప్రకటించారు. ఫిట్‌మెంట్ కమిటీ ప్రతిపాదించిన పన్ను రేట్లను కూడా సమావేశంలో పరిశీలించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news