కుటుంబాల్లో జరిగే గొడవల్లో ఎక్కువ అక్రమసంబంధాలు, అనుమానాలు ఉంటాయి. ఇవి ఒక ఎత్తు అయితే ఆస్తితగాదాలు మరోఎత్తు. ఆస్తికోసం సొంత అన్ననే నరికి చంపిన తమ్ముడు లాంటి నేరవార్తలను కూడా మనం వినే ఉంటాం. వీటికి ప్రధాన కారణం..వీలునామా. ఎవరికి ఆస్తి చెందుతుందో తెలియక ఒకరిమీదఒకరు గొడవలు పడుతుంటారు. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోతే..ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది. ఇలాంటి గొడవలు కూడా చాలానే జరగుతుంటాయి. ఈ విషయమే ఈరోజు మనం తెలుసుకుందాం.
హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలో ప్రథమే శ్రేణి వారసులు, ద్వితీయ శ్రేణి వారసులు ఉంటారు.
ప్రధమశ్రేణి వారసులంటే…
చనిపోయిన వ్యక్తి తల్లి
ఆ వ్యక్తి భార్య, కొడుకు, కూతురు. వీళ్లంతా ప్రధమేశ్రేణి వారసుల కిందకు వస్తారు.
ఒకవేళ కొడుకు కూడా చనిపోయి ఉంటే ఆ కొడుకు యొక్క సంతానం, కూతురు చనిపోతే ఆ కూతురు యొక్క సంతానం కూడా ప్రధమశ్రేణి వారసులే అవుతారు. వీళ్లకు ఆస్తి సమానంగా పంచాల్సి ఉంటుంది.
ద్వితీయ శ్రేణి వారసులంటే ఒకవేళ ఆ చనిపోయి వ్యక్తికి ఎవరూ బతికిలేకపోతే..మనవళ్లు, మనవరాళ్లు లేకపోతే..ఇక ఉన్నవ్యక్తుల గురించి చూస్తారు. ముందుగా ఆ పురుషుడి తరుపు చుట్టాలను చూస్తారు. అంటే అతనికి తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా అని, ఎవరూ లేకపోతే మహిళ అంటే ఆ వ్యక్తి భార్య తోబుట్టువులు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వ్యక్తికి కొడుకు లేదా కూతురు లేదా వారి సంతానం లేదా పెంచుకున్న పిల్లలు ఇలా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వీళ్లు ఎవరూ లేనిపక్షంలో ద్వితయ శ్రేణి వారసుల కోసం చూస్తారు.
ఒకవేళ ఆ వ్యక్తికి గనక రెండు పెళ్లిళ్లు అయితే.. రెండవ కుటుంబానికి చెందిన వారికి ఆస్తిపై హక్కు ఉండదు. హిందూ వివాహ చట్టం 1955లో వచ్చింది. అంతకుముందు బహుభార్యత్వం లీగల్ గా ఉండేది.. 1955 కి ముందు వివాహం అయ్యుంటే, చనిపోయే సమయానికి ఆయనకు ఇద్దరు భార్యలు ఉంటే, ఒక్క భార్య కిందే పరిగణించి భార్యకు వచ్చే భాగం ఆస్తిని ఇద్దరు భార్యలు పంచుకుంటారు.
1955 కి ముందు వివాహం అయితే రెండవ భార్య కూడా చట్టపరంగా భార్య కింద పరిగణించేవారు.. కానీ 1955 తర్వాత రెండవ పెళ్లి చేసుకుని, కుటుంబం ఉంటే మాత్రం రెండవ కుటుంబానికి చట్టపరమైన హక్కులు ఉండవు. కానీ చట్ట ప్రకారం అయితే మాత్రం వారి సంతానాన్ని కూడా ప్రథమ శ్రేణి వారసుల కిందట పరిగణిస్తారు. అయితే వ్యక్తి రెండవ భార్యకి ఆ వ్యక్తి స్వార్జితంలో మాత్రమే వాటా ఉంటుంది. తరతరాలుగా వస్తున్న ఆస్తిలో వాటా ఉండదట. కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే ఈ కథనం వ్రాయబడింది.