చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ.. అందం విషయంలో బాగా ప్రాధాన్యతగా తీసుకునే విషయాలు. ఈ రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నిగనిగలాడే చర్మం మీ సొంతం కావడానికి, మృదువైన అందమైన కేశాలు మీరు పొందడానికి మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటిలో బ్లాక్ సీడ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. బ్లాక్ సీడ్స్ ని సాధారణంగా నిగెల్లా అని పిలుస్తారు. ఇది చర్మానికి, జుట్టుకి చేసే మేలు గురించి ఈ రోజు తెలుసుకుందాం.
చర్మానికి మేలు చేసే అయుర్వేద పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు అధికం మొత్తంలో ఉంటాయి. అంతేకాదు ఇది యాంటీయాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.
బ్లాక్ సీడ్స్ ఆయిల్ ని మీ చర్మానికి వర్తించడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. పొడిబారడాన్ని తగ్గించి తేమను పెంచి మృదువుగా తయారు చేసి మెరిసే గుణాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా మొటిమలు రాకుండా ఉంటుంది. చర్మంపై వచ్చే నల్లమచ్చలని ఇది పూర్తిగా నివారిస్తుంది. హార్మోన్ల అసమతుల్యం, ఎండ కారణంగా వచ్చే మచ్చలని దూరం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే బ్లాక్ సీడ్స్ ఆయిల్ ని మీ సంరక్షణలో భాగం చేసుకోండి. నెత్తిమీద బ్లాక్ సీడ్ ఆయిల్ ని బాగా పట్టించడం వల్ల జుట్టు కుదుళ్ళకు పోషణ లభించి, జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. ఇంకా జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది. ఈ మధ్య కాలంలో యవ్వనంలోనే జుట్టు తెల్లబడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఈ బ్లాక్ సీడ్స్ ఆయిల్ ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.