సాధారణంగా క్యారెట్స్ సంవత్సరమంతా అందుబాటులో ఉన్నా శీతాకాలంలో మాత్రం క్యారెట్స్ ఎంతో తాజాగా ఉంటాయి. క్యారెట్స్ ను సలాడ్స్, జ్యూస్, సూప్స్ మరియు పుడ్డింగ్స్ లో ఉపయోగించవచ్చు. క్యారెట్స్ లో విటమిన్ ఏ, సి, కె , ఫోలేట్, పొటాషియం, ఐరన్ వంటివి ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇలాంటి పోషక విలువలు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
మీ రోజువారి ఆహారంలో క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుంది. విటమిన్ ఎ మరియు విటమిన్ సి క్యారెట్స్ లో ఉంటాయి వీటితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
ఒబేసిటీ సమస్య ఉండదు:
చాలా తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల్లో క్యారెట్లు కూడా ఒకటి. క్యారెట్స్ తినడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. ఈ విధంగా ఆ బరువు తగ్గడానికి సాయం చేస్తుంది.
కంటి సమస్యలు వుండవు:
క్యారెట్స్ లో బెటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది విటమిన్ ఏ లో ఒక రకం. కంటిచూపుకి ఇది చాలా అవసరం. కాబట్టి కంటిచూపు మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజూ క్యారెట్ ను ఏదో విధంగా తీసుకోవడం ఎంతో అవసరం.
చర్మ సౌందర్యం:
క్యారెట్స్ లో ఉండేటువంటి విటమిన్ సి మరియు విటమిన్ ఇ వల్ల చర్మ ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి సహాయపడుతుంది. కాబట్టి మీ డైట్ లో భాగంగా క్యారెట్స్ ను తీసుకోండి, ఆరోగ్యకరమైన చర్మంను పొందండి.