తిప్పతీగతో మహిళలు ఈ లాభాలని పొందొచ్చు.. ఆ సమస్యలే ఉండవు..!

-

తిప్పతీగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందొచ్చు. ఔషధ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేద వైద్యం లో కూడా వాడుతూ ఉంటారు, తిప్పతీగ తో మహిళలకి కూడా కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని ఆయుర్వేద శాస్త్రం అంటోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండడానికి తిప్పతీగ బాగా సహాయపడుతుంది. ముఖంపై మచ్చలు మొటిమలు ముడతలు వంటివి ఏర్పడకుండా చేస్తుంది తిప్పతీగ. తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఫ్రీ రాడికల్స్ నుండి ఇవి పోరాడగలవు.

అలానే శరీరం లోని కణాలు దెబ్బతినకుండా కూడా తిప్పతీగ చేస్తుంది. వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది తిప్పతీగ. ఇలా ఎన్నో సమస్యలు కూడా తిప్పతీగతో దూరమవుతాయి. తిప్పతీగ పొడి చేసుకుని బెల్లంతో పాటుగా తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు పైగా మధుమేహాన్ని నివారించే గుణాలు కూడా తిప్పతీగలో ఉంటాయి. టైప్ టు డయాబెటిస్ తగ్గడానికి తిప్పతీగ బాగా హెల్ప్ అవుతుంది.

తిప్పతీగ ద్వారా దగ్గు జలుబు వంటి శ్వాస కోస సమస్యలు కూడా దూరం అవుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు కూడా తిప్పతీగని ఉపయోగిస్తే మంచిది కానీ గర్భిణీలు పాలిచ్చే తల్లులు మాత్రం తిప్పతీగని మందుల్లో వాడకూడదు ఇలా తిప్పతీగతో ఎన్నో రకాల ప్రయోజనాలని పొందొచ్చు కాబట్టి తిప్పతీగని సమస్యల నుండి బయటపడడానికి ఉపయోగించవచ్చు ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు ఈ లాభాలను తిప్పతీగతో పొందొచ్చు ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news