తెలంగాణ రాష్ట్రంలో సమీపంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో అధికార BRS పార్టీ , మరియు ఇతర విపక్షాలు అన్నీ రాజకీయ ప్రణాళిలకలో నిమగ్నమై ఉన్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాబోవు ఎన్నికలలో అమలు చేయబోవు వ్యూహాల గురించి గాంధీభవన్ లో సమావేశం అయ్యారు. ఇందులో పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి అన్న అంశంపై చాలా సేపు చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా ఉండడంతో.. సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఒకవేళ సోనియా గాంధీ రాని పక్షములో చార్మినార్ నుండి గాంధీ భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టి … సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ మీటింగ్ కు ముఖ్యమైన నాయకులు అందరూ హాజరు అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ కు నాయకత్వం వహించారు.