మ్యూచువల్ ఫండ్: రూ.15 వేలతో ఏకంగా రూ.20 కోట్లు వెనకేయండి ఇలా..!

-

మీ రిటైర్ అయిపోయాక ఏ సమస్య లేకుండా హాయిగా ఉండాలని అనుకుంటున్నారా..? దీని కోసం మీరు డబ్బులు ఆదా చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక సూపర్ ఆప్షన్ ఒకటి అందుబాటులో వుంది. దీనితో మీకు అదిరే లాభాలు కలుగుతాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. మ్యూచువల్ ఫండ్ (Mutual Fund) బాగా ఉపయోగ పడుతుంది. పైగా మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. మీరు ప్రతి నెలా ఎంఎఫ్ సిప్ చేయాలి. 25 ఏళ్ల వయసులో మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేయడం స్టార్ట్ చేస్తే.. 60 ఏళ్ల రిటైర్మెంట్ కి ఎక్కువ డబ్బుల్ని వెనకేయ్యచ్చు.

మ్యూచువల్ ఫండ్/ Mutual Fund
మ్యూచువల్ ఫండ్/ Mutual Fund

మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణలు చెబుతుంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుందని గమనించాలి.

ఇలా 35 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రతి ఏడాది సిప్ మొత్తాన్ని పెంచుకోవచ్చు కూడా. ఒకవేళ దానిని పెంచుకుంటూ వెళితే అప్పుడు అధిక రాబడి సొంతం చేసుకోవచ్చు.

ఒకవేళ మీకు 25 ఏళ్ల వయసు అయితే నెలకు రూ.15 వేల సిప్ చేస్తే.. ప్రతి ఏడాది 10 శాతం స్టెప్ అప్ ఆప్షన్ ఎంచుకున్నారని అనుకుంటే రిటైర్మెంట్ కల్లా వీరికి రూ.20 కోట్లు లభిస్తాయి. ఇక్కడ వార్షిక రాబడి 11 శాతంగా వుంది.

ఒకవేళ మీరు స్టెప్ అప్ ఆప్షన్ తీసుకోలేదు అంటే మీరు నెలకు రూ.15 వేలు కడుతూ వస్తున్నారు. వార్షిక రాబడి 11 శాతంగా ఉంది. 35 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీకు రూ.7 కోట్లకు పైగా లభిస్తాయి. చూసారా ఎంత వ్యత్యాసం ఉందొ.

 

Read more RELATED
Recommended to you

Latest news