ప్రకృతిలో సహజంగా దొరికే ప్రతీదీ మనిషికి మంచి చేస్తుంది. ముఖ్యంగా తినే ఆహారపదార్థాల్లో చాలా మటుకు మన ఆరోగ్యాన్ని పెంచేవే. అందుకే సహజసిద్ధమైన ఆహారాలని తినాలని చెబుతుంటారు. మన శరీరంలో జీవక్రియలని సరిగ్గా చేసేలా చేసి, మనకి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని అందిస్తాయి. రోగాల బారి నుండి కాపాడే చాలా ఆహారాల్లో ముల్లంగి కూడా ప్రత్యేకమైనది. జలుగు, దగ్గు మీ దరిచేరినపుడు ముల్లంగిని ఆహారంగా తీసుకుంటే జలుబు నుండి తొందరగా బయటపడవచ్చు.
ముల్లంగిలో విటమిన్ , విటమిన్ బీ, విటమిన్ సి, పొటాషియం తగినంతగా ఉంటాయి. దానివల్ల శరీరానికి మంచి ఇమ్యూనిటీ లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీక్యానిన్లు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తపీడనాన్ని అదుపులో ఉంచడంలో ముల్లంగి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇందులో తక్కువ శాతం కార్బో హైడ్రేట్లు ఉంటాయి. దానివల్ల డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి కూడా బాగుంటుంది.
ఉత్తరాఖండ్ లోని కొందరు ప్రజలు ముల్లంగిని బంగాళదుంపతో పాటు కూర వండుకుంటారు. ఈ కూర అక్కడ తప్ప రెస్టారెంట్లలోనూ దొరకదు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్లలోనూ ఇది దొరకదు. దీన్ని తెచ్చావని అంటారు. దానర్థం కూరగాయలని చిన్నముక్కలుగా చేయడం. మరీ చూర్ణంగా చేసి కూరని ప్రిపేర్ చేస్తారు. ఇందులో ఉండే ముఖ్యమైన దుంపలు ముల్లంగి, బంగాళ దుంప. ముల్లంగి ద్వారా ఇన్ని లాభాలున్నాయి కాబట్టే చాలా మంది దీన్ని కూరలా చేసుకోవడానికి ఇష్టపడతారు.
ఇన్ని లాభాలున్న ముల్లంగి మీ ఆహారంలో భాగం చేసుకోండి. దీన్ని కూరగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఉత్తరాఖండ్ ప్రాంతం వారు ఎలా చేస్తారో తెలిపే వీడియో యూట్యూబ్ లో దొరుకుతుంది.