నవంబర్ 19 కార్తీక పౌర్ణమి నాడు చంద్ర గ్రహణం వచ్చిన సంగతి తెలిసిందే. కాని భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించలేదు. అయితే ఈసారి డిసెంబర్ 4 అనగా రేపు సూర్యగ్రహణం ఉందని తెలుస్తోంది. అయితే సూర్య గ్రహణం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. సూర్యగ్రహణం అనేది సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడుతుంది.
సూర్యుడికి చంద్రుడికి మధ్య లో చంద్రుడు వచ్చిన సమయంలో చంద్రుడికి సంబంధించిన నీడ మన భూమి మీద పడుతుంది. అయితే శనివారం అమావాస్య నాడు సూర్య గ్రహణం ఏ ప్రాంతాల్లో ఉంటుంది అనేది చూద్దాం. ఈ సూర్యగ్రహణం దక్షిణార్థ గోళంలో కొన్ని దేశాలలో మాత్రమే కనబడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది.
సూర్యగ్రహణం అంతటా అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ తీర ప్రాంత దేశాలు ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలలో కనపడనుంది అని తెలుస్తోంది. సెయింట్ హెలీనా, నమీబియా, జార్జియా దక్షిణ ప్రాంతం, దక్షిణ ఆఫ్రికా, శాండ్విచ్ ఐలాండ్స్, క్రోజెట్ ఐలండ్, లెసొతొ, ఫాక్‌లాండ్ ఐలండ్స్, చిలీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లో పాక్షికంగా మాత్రమే కనబడుతుంది.
డిసెంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటల 59 నిమిషాలకి సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:07 తో ముగుస్తుంది. 12:33 నిమిషాలకి గ్రహణం గరిష్ట స్థితికి చేరుకుంటుంది. ఇలా క్రమంగా పెరిగి 3:07 నిమిషాలకు గ్రహణ ఛాయ పూర్తిగా ముగుస్తుంది. అయితే మన భారతదేశంలో సూర్య గ్రహణం కనపడదని స్పష్టంగా తెలుస్తోంది.