PSPK29 : పవన్ తో సురేందర్ రెడ్డి ప్రాజక్ట్.. అధికారిక ప్రకటన!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మొన్నటి వరకు పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ సినిమాతో… మళ్లీ నీ ఫ్రెండ్ సెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలతో పవన్ కళ్యాణ్… దుమ్ము లేపుతున్నారు.

భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలలో ఫుల్ బిజీ అయిపోయారు పవన్ కల్యాణ్. ఇక ఈ తరుణంలోనే మరో సినిమాను ప్రకటించేశారు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన 29వ సినిమాను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో ఇవాళ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

ఈ మేరకు ప్రొడక్షన్ నంబర్ 9 తో ఓ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్ లో “యథా కాలం… తథా వ్యవహారం” అంటూ రాసుకొచ్చారు. అంతే కాదు ఈ పోస్టర్ లో గన్ కూడా కనిపిస్తోంది. అంటే ఈ సినిమా క్రైమ్ నేపథ్యం లో నడుస్తుందని మనకు అర్థమవుతోంది.    ఈ సినిమాకు రామ్ అల్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news