తిప్పతీగతో ఈ సమస్యలు మాయం..!

-

ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్న తిప్పతీగ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో చూడండి. నేటి కాలం లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తిప్పతీగల ఆకుల చూర్ణం తీసుకున్నారంటే… మన శరీరం వ్యాధుల తో పోరాడటానికి అవసరం అయ్యే రోగ నిరోధక శక్తిని పొందవచ్చు.

కీళ్ల నొప్పుల తో బాధపడే వారు తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి గోరు వెచ్చటి నీటిలో తాగడం ద్వారా కీళ్లనొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. అలానే జ్వరం, జలుబు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. ఈ తిప్పతీగ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా జీర్ణక్రియ సమస్య తో బాధ పడేవారు ఈ ఆకుల పొడిలో కొద్దిగా బెల్లంకలుపుకుని తీసుకుంటే జీర్ణక్రియలో ఏర్పడే సమస్యలు కూడా తొలగిపోతాయి.

చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే తిప్పతీగ చూర్ణం ప్రతి రోజు తీసుకుంటే చాలు. జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సంబంధించిన వ్యాధులను తగ్గించడం లో కూడా ఇది సహాయ పడుతుంది. చూసారా ఎన్ని ప్రయోజనలో మరి యిట్టె మీ సమస్యని తిప్పతీగ తో సాల్వ్ చేసేసుకుని ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news