జీఎస్టీకి టోపీ పెడుతున్న వ్యాపారులు..!

-

ప్రస్తుతకాలంలో రోజుకోక ఆవిష్రుతమవుతున్న సాంకేతికత అండతో నూతన విద్యానాలను అడ్డుపెట్టుకున్న కొందరు వ్యాపారులు అక్రమాలకు పూనుకుంటున్నారు. నకిలీ కంపెనీలు, ఇన్‌వాయిస్‌లతో రూ. కోట్లల్లో పన్ను ఎగవేతకు పాల్పడి జీఎస్టీకి టోపీ పెడుతున్నారు.అసలు కంపెనే ఉండదు, అయినా వాటి ద్వారానే ఇన్‌వాయిస్‌లు అందజేస్తున్నారు.జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 40కిపైగా నకిలీ బాగోతలు బయటపడి.. రూ.600 కోట్ల అక్రమాలు వెలుగుచూసి ఈ ఘటనల్లో 50 మందికి పైగా జైలుపాలయ్యారు.

ఈ విషయంలో గుజరాత్, దిల్లీ, మహారాష్ట్ర ఆ తర్వాత తెలంగాణలో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొందరైతే వేరే రాష్ట్రాల్లో బోగస్‌ కంపెనీలు సృష్టించి తెలంగాణ కంపెనీలకు నకిలీ ఇన్‌వాయిస్‌లు ఇచ్చిన ఘటనలూ ఉన్నావి. ఇటీవల 11 బోగస్‌ కంపెనీలు సృష్టించి ఎలాంటి సరుకులు రవాణా చేయకుండానే నకిలీ ఇన్‌వాయిస్‌లను 200 సంస్థలకు అందజేసినట్లు వెలుగు చూసింది. దీంతో రూ.67.76 కోట్ల జీఎస్టీకి టోపీ పెట్టిన సంఘటన మేడ్చల్‌ జీఎస్టీ కమిషనరేట్‌ పరి«ధిలో జరిగినట్లు సంబం«ధిత అధికారులు గుర్తించారు.

ఇటీవల వెలుగు చూసినవి..

1.రంగారెడ్డి, మేడ్చల్‌ జీఎస్టీ కమిషనరేట్ల పరిధిలో రెండు పన్ను ఎగవేతలు వెలుగు చూశాయి. రూ.139.93 కోట్ల విలువచేసే సరకు రవాణా చేసినట్లు చూపి రూ.19.7 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రిడిక్‌ తీసుకున్నట్లు ఇటీవల బయటపడింది.
2. రంగారెడ్డి పరిధిలో రూ.32.5 కోట్ల నకిలీ ఇన్‌వాయిస్‌ల విషయంలో బోగస్‌ కంపెనీలు సృష్టించి దాదాపుగా రూ.19 కోట్ల ఇన్‌పుట్‌ క్రిడిట్‌ తీసుకున్నట్లు మరో ఘటన వెలుగు చూసింది.

చెక్‌ పెట్టేందుకు..

అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు నూతన విధానాలను అనుసరిస్తున్నట్లు కేంద్ర జీఎస్టీ అ«ధికారులు తెలుపుతున్నారు. డీజీజీఐ అప్‌లోడ్‌చేసిన లావాదేవీలను కేంద్రం జీఎస్టీలోని ప్రత్యేక విభాగం శోధించి అక్రమాలను తెరపైకి తీసుకువస్తుందన్నారు. జీఎస్టీలో జరుగుతున్న∙అక్రమాల గుట్టు విప్పేందుకు కేంద్ర జీఎస్టీకి చెందిన వివిధ విభాగాలు, సాంకేతికత తోడుతో వివిధ మార్గాలపై దృష్టి సారిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news