చాలా మంది యోగాని చేస్తూ ఉంటారు. అయితే యోగా చేయడం వల్ల శారీరకంగా మరియు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా యోగాసనాలు మనకి బాగా ఉపయోగపడతాయి.
సాధారణంగా చలికాలంలో మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఇబ్బందులకు దూరంగా ఉండాలి అంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి. అయితే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి యోగా మనకి బాగా సహాయం చేస్తుంది. అయితే ఎటువంటి యోగాసనాలు వేయడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.
బాలాసనం (చైల్డ్ పోజ్):
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని కొన్ని సెకన్లపాటు వేస్తే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అవుతుంది.
ధనురాసనం (బౌ పోజ్):
ఈ ఆసనం కూడా మనకి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆసనం తో ఎన్నో ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఈ ఆసనం వేసేటప్పుడు ముఖాన్ని తిన్నగా ఉంచి కాళ్ళని ఎంత ఎక్కువ స్ట్రెచ్ చేయగలిగితే అంత ఎక్కువ చేయండి. 4 నుండి 5 సార్లు శ్వాస తీసుకుని మళ్ళీ తిరిగి మీ పొజిషన్ లోకి వచ్చేయండి. ఇలా ఈ ఆసనాన్ని మీరు చేయడం వల్ల కూడా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
సేతు బంధాసనం (బ్రిడ్జ్ పోజ్) :
ఇది కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే భుజంగాసనం, శవాసనం కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది కాబట్టి యోగాని చేసేవారు ఈ ఆసనాలతో సులువుగా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అలానే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.