ఇన్ఫెక్షన్ నుండి త్వరగా బయట పడాలంటే ఇలా చెయ్యండి..!

-

ఈ మధ్య కాలంలో అనారోగ్యసమస్యలు ఎక్కువైపోయాయి. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటువంటి సమయంలో జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే కడుపునొప్పి, సైనస్ లాంటివి కూడా వ్యాపిస్తున్నాయి. అయితే సమస్యల బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.

అలానే పోషక పదార్దాలని ఎక్కువగా తీసుకోవాలి. మంచి పోషకాహారం ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ రోగ నిరోధకశక్తిని పెంచుకునేటట్టు చూసుకుంటే చాలా సమస్యలు బారిన పడకుండా ఉండొచ్చు. సరిగ్గా నిద్ర లేకపోవడం వంటి వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గవు. అలానే ఈ సమస్యలకి దూరంగా ఉండాలి అనే స్మోకింగ్ కి దూరంగా ఉండాలి. సూర్యకిరణాలకు, ఒత్తిడికి, సెక్స్ మరియు అతిగా ఆహారం తీసుకోవడం లాంటి వాటి వల్ల ఎనర్జీ తక్కువై పోతుంది. దీంతో ఇన్ఫెక్షన్స్ తో పోరాడే అవకాశం తగ్గుతుంది. అయితే ఇన్ఫెక్షన్స్ తో పోరాడాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • లైట్ గా ఆహార పదార్థాలను తీసుకోవాలి.
  • ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి.
  • డైరీ ఫుడ్స్ కి దూరంగా ఉండండి.
  • విటమిన్ సి ని ఎక్కువగా ఆహారం తీసుకుంటూ ఉండండి.
  • వంటల్లో అల్లం, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను ఉపయోగించండి.
  • నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండండి.
  • ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు. దీంతో ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news