అమెజాన్‌, ఫ్లిప్ కార్ట్‌ల‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ ఇవే..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ప్ర‌త్యేక సేల్‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. అమెజాన్‌కు చెందిన ప్రైమ్ డే సేల్ సోమ‌, మంగ‌ళ‌వారాల్లో కొన‌సాగ‌నుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈ నెల 29వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఈ సేల్‌ల‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

best deals on laptops in amazon and flipkart

ఫ్లిప్‌కార్ట్ డీల్స్

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ప‌లు ల్యాప్‌టాప్‌ల‌పై భారీ రాయితీల‌ను అందిస్తున్నారు. అసుస్‌కు చెందిన వివోబుక్ 15 ల్యాప్‌టాప్‌ను రూ.32,490 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. అదేవిధంగా HP 15s-fq2075TU ల్యాప్‌టాప్ ధ‌ర రూ.40,490 ఉండ‌గా, Nokia PureBook X14 ధ‌ర రూ.49,490గా ఉంది. అలాగే Acer Aspire 5 (ధర రూ.51,490), Lenovo Ideapad Slim 3i (ధ‌ర రూ.56,490), Lenovo IdeaPad Slim 5i (ధ‌ర రూ.64,490), HP Pavilion 14-dv0084TX (ధ‌ర రూ.71,490), ASUS ZenBook 13 OLED (ధ‌ర రూ.82,490) ల్యాప్ టాప్ లు కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ల‌భిస్తున్నాయి. వీటిల్లో అద్బుత‌మైన ఫీచ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు.

అమెజాన్ డీల్స్

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ప‌లు ల్యాప్‌టాప్‌ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు. Acer Extensa 15 ధ‌ర రూ.24,990 ఉండగా HP 15s-gr0006au ధ‌ర రూ.31,990గా ఉంది. అలాగే Lenovo IdeaPad Slim 3i (ధర రూ.38,990), HP 15s-du1066TU (ధ‌ర రూ.39,990), HP Pavilion 14-dv0084TX (ధ‌ర రూ.70,990) ల్యాప్‌టాప్‌ల‌ను కూడా త‌గ్గింపు ధ‌ర‌లకు పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news