డైటింగ్ చేస్తున్నారా…? అయితే ఈ టిప్స్ ని గుర్తుంచుకోవాల్సిందే…!

-

నేటి కాలం లో ప్రతీ ఒక్కరు డైటింగ్ చేస్తూనే ఉన్నారు. బరువు పెరిగినా, శరీరం లో ఎక్కడైనా కొవ్వు పెరిగిందని అనిపించినా వెంటనే డైటింగ్ ని స్టార్ట్ చేసేస్తున్నారు. ప్రతీ ఒక్కరికి కూడా స్లిమ్ గా ఉండాలనే ఉంటోంది. అయితే ఈ డైటింగ్ గురించి వస్తే… డైటింగ్ చేసేటప్పుడు చాలా కొద్ది మోతాదు లోనే ఆహారం తినాలని అనుకుంటాం. అదే చేసేస్తాం కూడా. అయితే అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే..? ఆకలే మనం తీసుకునే ఆహారంకి కారణం. సీజన్‌, మన ఆలోచన తీరు, ఎంత చక్కగా నిద్రపోయాం, ఎంత సమయం వ్యాయామం చేశాం వంటి చాలా విషయాల పై ఆధారపడి ఉంటుందని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు.

ఇక డైటింగ్ చేసే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఈ విషయం లోకి వస్తే… కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, క్యాలరీలు మితి మీరి తీసుకోకూడదు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఆహారం తీసుకోవాలి. అంతే కాదు సాధ్యమైనంత వరకు స్థానిక, సీజనల్‌, సంప్రదాయ ఆహారమే తినాలి. ఇది డైటింగ్ చేసే వాళ్ళు తప్పక గుర్తుంచుకోవాలి. అలానే ఆహారాన్ని ఒక గొప్ప వరంలా చూడాలి అని కూడా గుర్తుంచుకోండి.

ఆహారం వడ్డించుకునే సమయంలో రైతులతో సహా ఎందరికో కృతజ్ఞతలు చెప్పాలి. ఆహారాన్ని వృథా చేయొద్దు. తినేది కొద్దిగానే అయినా సరే.. మనసు పెట్టి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి. కనుక డైటింగ్ చెయ్యాలని అనుకునే వారు మాత్రం తప్పక ఈ విషయాలని గుర్తుంచుకుని తీరాలి. ఈ టిప్స్ చక్కటి డైటింగ్ లో బాగా ఉపయోగ పడతాయి. వీటిని కనుక మీరు దృష్టి లో పెట్టుకుంటే మీరు అనుకున్నది చెయ్యగలరు దానితో పాటు మీరు ఆరోగ్యంగా కూడా ఉండగలరు.

Read more RELATED
Recommended to you

Latest news