ఒక్క ఓటమితో రూ.1000 కోట్లు నష్ట పోయార‌ట‌..!

-

భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌లో భారత్ ఓటమి కారణంగా బెట్టింగ్ రాయుళ్లు సుమారుగా రూ.1000 కోట్లు నష్టపోయారని తెలిసింది. ఒకే ఒక్క మ్యాచ్ వారి తలరాతల‌ను మార్చేసింది.

ప్రపంచ కప్ లోనే కాదు టీమిండియా ఏ మ్యాచ్ ఆడినా సరే.. ఏ దేశంతోనైనా సరే.. ఏ టోర్నీ అయినా స‌రే.. భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతుంటాయి. మ్యాచ్ ముగింపు వరకు.. చివరి ఓవర్ చివరి బంతి వరకు.. రూ. కోట్లలో బెట్టింగులు జరుగుతాయి. అయితే అంతా అనుకున్నట్లుగా జరిగితే బెట్టింగ్ కాసే వారి పంట పండుతుంది. అది తారుమారైతే కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. తాజాగా జరిగిన భారత్, న్యూజిలాండ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా బెట్టింగ్ రాయుళ్లు కొన్ని కోట్ల రూపాయలు నష్ట పోయార‌ట‌..!

భారత్, న్యూజిలాండ్ జ‌ట్ల‌ మధ్య ఈ నెల 9వ తేదీన జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలిరోజు ఆట పూర్తిగా సాధ్యం కాకపోవడంతో రెండో రోజు రిజర్వ్‌ డే రోజున మిగిలిన మ్యాచ్ నిర్వహించారు. ఈ క్రమంలో భారత్ ఛేదించాల్సిన లక్ష్యం చాలా తక్కువే అయినప్పటికీ న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. కాగా ఆ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని భావించిన బెట్టింగ్ రాయుళ్లు కొన్ని వేల కోట్ల రూపాయలు టీమిండియాపై పందాలు కాశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ మ్యాచ్‌ లో భారత్ గెలిస్తే ఒక్క రూపాయి, న్యూజిలాండ్ గెలిస్తే పది రూపాయలు ఇస్తామని చెప్పడంతో చాలామంది పందాలు కాశార‌ట‌. అయితే మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని అనుకున్న బెట్టింగ్ రాయుళ్లు భారత్ పైనే బెట్టింగ్ కాశారు కానీ సీన్ రివర్స్ అయింది. భారత్‌ ఓడిపోయింది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కొన్ని కోట్ల రూపాయలు నష్ట పోయార‌ని స‌మాచారం.

భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌లో భారత్ ఓటమి కారణంగా బెట్టింగ్ రాయుళ్లు సుమారుగా రూ.1000 కోట్లు నష్టపోయారని తెలిసింది. ఒకే ఒక్క మ్యాచ్ వారి తలరాతల‌ను మార్చేసింది. బెట్టింగ్‌ ఏజెన్సీలు చెబుతున్న సమాచారం ప్రకారం భారత్‌పై పందాలు కాసిన వారు కొన్ని లక్షల మంది ఉన్నారని, అంతా కలిసి రూ.1000 కోట్లను బెట్టింగుల రూపంలో పోగొట్టుకున్నారని సమాచారం. ఈ క్రమంలో డబ్బు నష్టపోయినవారు తీవ్ర విచారంలో ఉన్నార‌ని తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ప‌లు మెట్రో నగరాల్లో బెట్టింగ్ బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారని జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఏది ఏమైనా.. టీమిండియా ఓట‌మి మాత్రం ఇటు బెట్టింగ్ రాయుళ్ల‌కూ తీర‌ని నిరాశ‌నే మిగిల్చింద‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news