ఫాస్టాగ్ అప్డేట్: ఫేక్ ఫాస్టాగ్స్ కొనుగోలు చెయ్యొద్దు…!

-

ప్రభుత్వం ఫాస్టాగ్ ని కంపల్సరీ చేసిన సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని సందర్భాలను చూసినట్లయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎంహెచ్ఏఐ ప్రజలని హెచ్చరించడం జరిగింది. కొంత మంది ఫ్రాడ్స్టార్స్ ఫేక్ ఫాస్టాగ్ లని అమ్ముతున్నట్లు చెప్పడం జరిగింది. అయితే ఎంహెచ్ఏఐ మరియు ఐహెచ్ఎంసిఎ చాల వెబ్సైట్ ఫేక్ ఫాస్టాగ్ ని అమ్ముతున్నట్లు తెలియజేసింది.

fastag

ఫాస్టాగ్ ని ఎక్కడ కొనుగోలు చేయాలి..?

ఒరిజినల్ ఫాస్టాగ్ ని కొనుగోలు చేయాలంటే https://ihmcl.co.in/ లేదంటే MyFastag App లో మాత్రమే కొనుగోలు చేయండి. లేదు అంటే మీరు కొన్ని బ్యాంకుల నుంచి నేరుగా పొందొచ్చు. ఒకవేళ మీ ఫాస్టాగ్ ఫేక్ అయితే మీరు NHA హెల్ప్ లైన్ నెంబర్ 1033 కి డైల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఫిబ్రవరి 15 నుండి ఫాస్టాగ్ ని కంపల్సరీ చేసిన సంగతి తెలిసిందే.

మీకు వెంటనే ఫాస్టాగ్ లభించాలి అంటే..?

మీరు Amazon.in లేదా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు పేటియం పేమెంట్ బ్యాంక్ లో కొనుగోలు చెయ్యొచ్చు. తాజాగా ఐసిఐసిఐ బ్యాంక్ గూగుల్ తో కలిసి ఫాస్టాగ్ ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందిస్తోంది అని చెప్పడం జరిగింది. మీరు బ్యాంకు ద్వారా ఫాస్టాగ్ ని కొనుగోలు చేయాలి అంటే వెబ్సైట్లో చూడొచ్చు లేదు అంటే నేరుగా బ్యాంకు కి వెళ్లొచ్చు.

ఫాస్టాగ్ కి రీఛార్జ్ ఎలా చేయాలి..?

మీరు దీనికి రీఛార్జ్ ఆన్లైన్ ద్వారా చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెఫ్ట్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా చేయొచ్చు. ఒక లక్ష రూపాయల వరకు మీరు దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ పేమెంట్ ఆప్స్ అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఎయిర్టెల్ పేమెంట్స్ వంటి వాటిని కూడా ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news