“భీమ్లా నాయక్” బ్రేక్ టైం.. పవన్ ఆన్ ఫైర్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో “బీమ్లానాయక్‌” పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పునః ప్రారంభం అయింది.

అయితే.. ఈ తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్  వచ్చింది. ఈ సినిమా నుంచి బ్రేక్ టైమ్ ఫర్ బీమ్లా నాయక్ అంటూ న్యూ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో పవన్ కళ్యాణ్ తుపాకి పట్టుకుని బుల్లెట్ల వర్షం కురిపించాడు. వైట్ షర్ట్ వేసుకొని.. ఫైరింగ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఇక తాజాగా విడుదల అయిన ఈ వీడియో తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ లో మరింత కోలాహలం మొదలైంది. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news