భీమ్లా నాయ‌క్ రిజ‌ల్ట్ ఇదే.. రివ్యూ కాదు వ్యూ

-

చాలా రోజుల‌కు ఖాకీ చొక్కా వేశారు మా ప్రియ‌మ‌యిన హీరో ప‌వ‌న్. కొన్నింటిని న‌మ్ముకుని రిపీట్ చేస్తున్నారు ఆయ‌న.ఆ విధంగా మ‌ల‌యాళం సినిమాను అదే మ‌ల‌యాళం ముద్దుగుమ్మ‌ల న‌డుమ మ‌రోసారి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్న‌మే భీమ్లా నాయ‌క్.అయితే అహంకారం ఎవరిది ఆత్మ గౌరవం ఎవ‌రిది అన్న‌ది సినిమాలో క‌న్నా నిజ జీవితంలో ఇంకా చెప్పాలంటే ఇప్ప‌టి ఆంధ్రా రాజ‌కీయ నాయ‌కుల జీవితాల్లోనే ఎక్కువ‌గా వ‌ర్కౌట్ అయ్యే రూల్.

ఆ విధంగా అహం వైసీపీది అని ఆత్మ గౌర‌వం మాత్రం మాదేనని మ‌రోసారి చెబుతున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్. ఆ విధంగా చూసినా ఏ విధంగా చూసినా ద్వేషం అటుంచి చూస్తే ఈ సినిమా హిట్టు. రాస్కో సాంబ ఇది ఫిక్సు.

ప్రీ రిలీజ్ వేడుక‌ల్లో నిత్యా లేరు. సంయుక్త మేన‌న్ వ‌చ్చారు. ఎన్నోమంచి మాట‌లు చెప్పారు..
అలాంటి మాట‌ల‌కు కేరాఫ్ కూడా ఈ సినిమా కావొచ్చు .. కానీ త్రివిక్ర‌మ్ ఇర‌గ‌దీశాడు అర‌గ‌దీశాడు అని రాయ‌కుండా ఉంటే ఈ సినిమా హిట్టే! నో డౌట్ ఇన్ ఇట్ .. రవి కె చంద్ర‌న్ హిట్టు..అదే విధంగా ఎడిట‌ర్ కూడా హిట్టే! నిర్మాత వంశీ కొంత అతి వాగుడు వినిపించ‌లేదు క‌నుక ఆ ప‌రంగా ఆయ‌న కూడా హిట్టే! టోట‌ల్ గా ఫైనల్ గా ఈ సినిమా హిట్టే! అబ్బా! ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ కాకుండా మ‌రో డైలాగ్ రైట‌ర్ ఉంటే బాగుండు అని  అనుకున్నాను.

అదొక్క‌టే కాలేదు. ఎందుకంటే సుస్వాగ‌తం సినిమా రోజుల నుంచి కూడా ప‌వ‌న్ డైలాగ్ ఎలా ఉంటుందో తెలుసు క‌నుక! చింత‌ప‌ల్లి ర‌మ‌ణ లాంటి పాల‌కొల్లు కుర్రాడు ఎలాంటి మాట‌లు రాశారో కూడా తెలుసుకున్నాను క‌నుక‌! అలానే పోలీసోళ్ల పై పాట ఒక‌టి ఉంది. ఆ పాట వినే క‌న్నా అబ్బా! ఆయ‌న్ను అదే ప‌నిగా పొగుడుతున్నారు చూడండి అదే మోస్ట్ యంబార్సింగ్ థింగ్.. వాస్త‌వానికి ఆ పాట‌లో ఏమీ లేదు కానీ అదే ప‌నిగా పొగుడుతున్నారు. ఆ పాట ఆయ‌న రాయ‌కుండా ఉంటే బాగుండు. ఆ విధంగా ఈ ఇద్ద‌రి ఫ్లేవ‌ర్ లేకుండా ఉంటే ఇంకా బాగుండు. ఆయ‌న అన‌గా రాంజో! అని అర్థం. ఇక సినిమాలో వ‌చ్చే మొగుల‌య్య ఆలాప్ అదుర్స్. ఆవిధంగా సినిమా హిట్టు. దుర్గ‌వ్వ పాట హైలెట్..ఆ విధంగా ఇంకా పెద్ద హిట్టు. కొన్ని వ‌దిలి కొన్ని గుర్తు పెట్టుకుని సినిమా చూస్తే హిట్టు.ఆ విధంగా బొమ్మ హిట్టు.

బొమ్మ అదిరిపోయింది.. భీమ్లా నాయ‌క్ రిజ‌ల్ట్ ఇదే.ప‌వ‌న్ మ‌రియు రానా వీళ్లిద్ద‌రూ ఇర‌గ దీశారు.త్రివిక్ర‌మ్ కొన్ని రొటీన్ మాట‌లు రాశారు.ఆ సోది ఎలా ఉన్నా కూడా సినిమా హిట్ . ఈ సినిమాను తీసింది సాగ‌ర్ కే చంద్ర అనే యువ‌కుడు.న‌ల్గొండ కుర్రాడు. మ‌న తెలంగాణ ఇంటి బిడ్డ.కొంత త్రివిక్ర‌మ్ పైత్యం సినిమా పై ఉంది పెత్త‌నం కూడా ఉంది.ఆ సోది ఎలా ఉన్నా ఆ నిర్మాత వంశీ ఓవ‌ర్ యాక్ష‌న్ ఎలా ఉన్నా కూడా సినిమా హిట్టు.త‌మ‌న్ గారు బాగానే మ్యూజిక్ ఇచ్చారు.ఆ విధంగా ఆడు కూడా ఈ సారి యాడు అయ్యారు.అడిష‌న‌ల్ ఫ్లేవ‌ర్ అయ్యారు.ఇక ప‌వ‌న్ మొద‌ట్నుంచి న‌మ్ముకున్న మాస్ ఇమేజ్ ను మ‌రోసారి రిపీట్ చేసి హిట్టు కొట్టారు. మ‌రీ గుంటూరు కారం ఆ యూనిఫారం లాంటి రొడ్డ కొట్టుడు లిట‌రేచ‌ర్ రాయ‌కుండా రామ‌జోగయ్య శాస్త్రి ఇక‌పై ఉంటే మేలు.ఏదేమ‌యినా బొమ్మ హిట్టు.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి….

Read more RELATED
Recommended to you

Latest news