రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్న అమెరికా, యూరోపియన్ దేశాలు

-

రష్యా భీకర దాడితో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. వరసగా ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకున్నాయి. ఈరోజు రాజధాని కీవ్ ను కూడా రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. దుందుడుకుగా వ్యవహరిస్తున్న రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ఆంక్షల ఆస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించాయి. 

రష్యా దాడుల్ని తీవ్రంగా తప్పుబట్టిన అమెరికా.. రష్యాపై కఠిన ఆంక్షలు విధించారు జోబైడెన్. యూఎస్‌లోని 4 రష్యా బ్యాంకుల ఆస్తులు ఫ్రీజ్‌ చేయడంతో పాటు 250 బిలియన్‌ డాలర్ల వీటీబీ బ్యాంక్‌ ఆస్తులు ఫ్రీజ్ చేయనున్నారు. రష్యాకు మా మిత్ర దేశాల నుంచి ఎగుమతులు నిలిపివేస్తాం అని జో బైడెన్ తెలిపారు. అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాలను బ్యాన్ చేస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ పరంగా రష్యాను దెబ్బతీస్తాం అని జోబైడెన్ అన్నారు. రష్యా ఏయిరో స్పెస్ ఇండస్ట్రీ, స్పెస్ టెక్నాలజీ రంగాలను దెబ్బతీస్తాం అని అన్నారు.

మరో వైపు యూకే కూడా రష్యాపై ఆంక్షలు విధిస్తోంది. యూకే ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యా బ్యాంకులను తొలగించారు. యూకే నుంచి రష్యా నిధులు సమీకరించకుండా… ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలపై నిషేధం. ఇటీవలే 5 రష్యా బ్యాంకులపై నిషేధం విధించాయి యూరోపియన్ దేశాలు. ముగ్గురు రష్యా అపరకుబేరుల అకౌంట్లను ఫ్రీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news