రాష్ట్రంలో పవన్ కల్యాణ్ స్టేట్‌రౌడీ.. జనసైనికులు ఆకు రౌడీలుగా తలపిస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. భీమవరం అర్బన్ బ్యాంక్ దోచేశానని.. తానోక ఆకు రౌడీనంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయమని.. సినిమా కాదని ఇష్టమొచ్చినట్లు డైలాగ్‌లు కొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ నాయకుల మెడమీద తలకాయలు ఉండవని.. తలకాయలు తీసేస్తానని మాట్లాడిన వీడియోలను శ్రీనివాస్ మీడియా ముందు చూపించారు.
ఆయన మానసిక రోగి..
పవన్ కల్యాణ్ ఓ మానసిక రోగి అని.. అందుకే చిన్నప్పుడు పలుమార్లు ఆత్మహత్యకు పాల్పడ్డాని ఆయన ఆరోపించారు. మత్స్యపురి గ్రామంలో జరిగిన ఘటనలో పూర్తి సమాచారం తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని ఏదో తెలిసి తెలియని సమాచారంతో మాట్లాడితే ఎవరూ ఊరుకోరని గ్రంధి శ్రీనివాస్ హెచ్చరించారు. భీమవరం అర్బన్ బ్యాంక్ దోచేశానని చెబుతున్న పవణ్ తన మిత్రుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపై ఎందుకు కేసు పెట్టాలేదని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలన్నీ సినిమాలకు సరిపోతాయని ఇలాంటి మాటలు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చావన్నారు. ప్రజలపై అభిమానం ఉంటే వారికేదైన మంచి చేయాలని లేనిపోని మటలు చెప్పి వారిని గందరగోళానికి గురి చేస్తున్నారని గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.