మాజీమంత్రి భూమా అఖిల ప్రియ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేవాలయాలపై దాడులు చేస్తూ రాష్ట్రంలో అల్లకల్లోలం రేపుతున్నారని ఆమె ఆరోపించారు. ఆలయాలపై దాడులు చేసే గ్యాంగ్ ను ప్రభుత్వం పట్టుకోవాలని ఆమె డిమాండ్ చేసారు. ప్రభుత్వానికి చేతకాకపోతే కేంద్రం ఒక టీమ్ ను ఏర్పాటు చేసి దాడులపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేసారు. దేవాలయాలపై దాడులు ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరగలేదని అన్నారు.
ఈరోజు ఆలయాలు, రేపు మసీదులు ఆ తర్వాత చర్చీ లపై దాడులు జరుగుతున్నాయని జనం నమ్ముతున్నారని ఆమె పేర్కొన్నారు. దేవుడికే రక్షణ లేకపోతే ప్రజలకు ఏమి రక్షణ కల్పిస్తారు అని నిలదీశారు. మంత్రి కొడాలి నాని తిరుపతి డిక్లరేషన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇంట్లో ఉన్నప్పుడు ఏ దేవుడి నైనా పూజించుకోవచ్చని, రాష్ట్ర సియంగా బయటకు వచ్చినప్పుడు అన్ని కులాలు, మతాలను గౌరవించాలి. లేకపోతే వేస్ట్ అని అన్నారు.