రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ చార్టుల ప్రిపరేషన్ లో కొత్త విధానం జులై 7వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఇప్పటివరకు రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్ అవుతుండగా రేపటి నుంచి ఎనిమిది గంటల ముందుగానే ఛార్ట్ ప్రిపేర్ కానుంది. మధ్యాహ్నం రెండు గంటల లోపు బయలుదేరే రైళ్ల ఛార్ట్ లను ముందు రోజు రాత్రి 9 గంటల వరకు రిలీజ్ చేస్తారు.

దీనివల్ల బెర్త్ దొరకని వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా… వందే భారత్ ట్రైన్ లో కోచ్ లను పెంచుతూ రైల్వే శాఖ అనౌన్స్ చేసింది. రైళ్లలో నాలుగు చొప్పున కోచ్ లు పెంచినట్లుగా దక్షిణ మధ్య రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఏసీ చైర్ కారు కోచ్ లు 14 ఉండగా వాటిని 18కి పెంచింది. దీంతో వందే భారత్ ట్రైన్లలో ప్రయాణం చేసేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.