తెలుగు బిగ్ బాస్ షో లో ఊహించని ట్విస్ట్..!!

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది. వాస్తవానికి గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా డల్ గా నడుస్తుందని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అసలే అంతగా ఫేమ్ లేని వారు రావటం వల్ల రేటింగ్ రావడం లేదు. ఇక ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు. వారిలో గలాటా గీతు, సూర్య, బాలాతిద్య, రీసెంట్ గా వాసంతి ఎలిమినేట్ అయ్యింది.

దీనితో బిగ్ బాస్ షో రేటింగ్ పెంచడం కోసం రకరాలుగా షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొత్తగా ఇంట్లో కొంచెం గ్లామర్ గా కనిపిస్తున్న శ్రీ సత్య ను ఎక్కువ చూపించడం స్టార్ట్ చేసాడు. గతంలో ఆమె తనని ఎవ్వరు తనని టచ్ చేసినా నచ్చదని, చేయి తాకినా నచ్చదని చెబుతూ అర్జున్‌ను క్లాస్ పీకింది. కానీ ఇప్పుడు మాత్రం శ్రీహాన్‌ తో రాసుకొని పూసుకొని తిరుగుతోంది. ఛాన్స్ దొరికితే చాలు ఇద్దరూ చేతిలో చేయి వేసి కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఇక నామినేషన్ విషయంలో  శ్రీ సత్యకు మాత్రం తాజాగా బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు.నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు బిగ్ బాస్ కంటేస్తెంట్స్ కు ఆఫర్ ఇచ్చాడు. గెలిస్తే ఇచ్చే బిగ్ బాస్ ప్రైజ్ మనీ లోంచి కొంత సీక్రెట్ ఎమౌంట్ రాసి బాక్స్ లో వేయాలని , కాని ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాడు.కాని శ్రీ సత్య ఈ విషయాన్ని శ్రీ హాన్ కు చెప్పడంతో ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు. దీనితో శ్రీ సత్యకు మైండ్ బ్లాక్ అయ్యింది.

 

Read more RELATED
Recommended to you

Latest news