బిగ్ బ్రేకింగ్; హైదరాబాద్ కరోనా వార్డుల్లో సిఆర్పీఎఫ్ బలగాలు…!

-

తెలంగాణాలో క్రమంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నా సరే కేసులు పెరగడం చూసి ఇప్పుడు ప్రభుత్వంలో కంగారు మొదలయింది. కట్టడి అయినట్టే అయిన కరోనా ఒక్కసారిగా తెలంగాణాలో చెలరేగిపోయింది. రెండు రోజుల్లో దాదాపు 50 కేసులు నమోదు కావడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతుంది. వాళ్ళు అందరూ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్ళే.

వాళ్ళ నుంచి సోకిన ఈ కరోనా ఇప్పుడు తెలంగాణాలో చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఒక పక్క తెలంగాణాలో కరోనా ఇబ్బంది పెడుతుంటే… గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల మీద దాడి చేసారు. దీనితో ఇప్పుడు కరోనా వైద్యం చేయలేమని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. తమకు రక్షణ కల్పిస్తేనే వైద్యం చేస్తామని స్పష్టంగా చెప్పడంతో వారితో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చలు జరిపారు.

తెలంగాణా వ్యాప్తంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. కరోనా వార్డుల్లో సిఆర్పీఎఫ్ బలగాలను పెట్టాలని డిమాండ్ చేసారు. ఇంకోసారి తమ మీద దాడి జరిగితే మాత్రం వైద్యం చేసేది లేదని స్పష్టం చేసారు. జూనియర్ డాక్టర్లతో డీఎంవో రమేష్ సమావేశం అయ్యారు. అసలు బంధువులను లోపలికి అనుమతించవద్దు అని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news