భారత్ లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. కేరళ రాష్ట్రంలో మూడో కేసు నమోదు అయింది. భారతదేశంలో కరోనావైరస్ మూడవ కేసును కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజా ధృవీకరించారు కేరళలోని కాసర్గోడ్లో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ గా గుర్తించారని ఆయన తెలిపారు. ఆయన చైనా నుంచి వచ్చారని, ఆయనను పరిక్షించాగా కరోనా బయటపడిందని పేర్కొన్నారు.
నమోదు అయిన మూడు కేసులు కూడా కేరళలోనే నమోదు కావడంతో అక్కడి ప్రజలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖా మంత్రి… “రోగి కాసరాగోడ్ లోని కంజాంగాడ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోగి ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. సదరు వ్యక్తి చైనాలోని వుహాన్ నుండి తిరిగి వచ్చాడు” అని షైలాజా చెప్పారు.
ఇక చైనాలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. అక్కడ క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 20 వేల మందికి ఈ వ్యాధి సోకిందని అధికారులు వెల్లడించారు. ఇక మృతుల సంఖ్య కూడా 400 కి చేరుకుందని ఆ దేశం ప్రకటించింది. దీనితో చైనాలో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. ఇక అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది.