‘ఆర్ఆర్ఆర్’ లో అమితాబ్, మహేష్…..మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు…!!

-

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్ పై అటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సహా ఇతర దేశాల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు కథను వి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక సంచలన వార్త బయటకు రావడం జరిగింది.

అదేమిటంటే, ఈ సినిమాలో మహేష్, అమితాబ్ బచ్చన్ భాగం కానున్నారట. అయితే తెరపై కాదు, తెర వెనుక అన్నమాట. ఈ సినిమా హిందీ వర్షన్ కు అమితాబ్, అలానే తెలుగు వర్షన్ కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొన్నాళ్ల క్రితం రాజమౌళి వీరిద్దనిని కలిసి ఒప్పించినట్లుగా చెప్తున్నారు. అలానే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోని అగ్ర నటులను కూడా అతి త్వరలో కలిసి వారితో కూడా అక్కడ వాయిస్ ఇప్పించనుందట ఆర్ఆర్ఆర్ టీమ్.

 

ఇప్పటికే తెలుగు సహా 10 భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండగా, నేడు బయటికి వచ్చిన ఈ న్యూస్ తో ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయనే చెప్పాలి. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, అలానే రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్ర ఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని జులై 30న రిలీజ్ చేయనున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news