తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. కానీ నిన్న పరీక్ష స్టార్ట్ అయిన కాసేపటికే వికారాబాద్ జిల్లా తాండూరు లో తెలుగు క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూప్ లో కనిపించడంతో పెద్ద వివాదాస్పద చర్చకు దారి తీసింది. అయితే తీరా చూస్తే తాండూరు గవర్నమెంట్ స్కూల్ లో ఇన్విజిలేటర్ ఆ పేపర్ ను తన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడని తెలిసింది. ఈ ఘటనలో నిన్న బందెప్ప మరియు సమ్మప్ప లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ప్రస్తుతం రిమాండ్ లో ఉంచి పోలీసులు తగు రీతిలో విచారిస్తున్నారు.
కాగా ఈ విచారణలో బందెప్ప కీలక విషయాలను బయటపెట్టాడు. పరీక్ష హాల్ లో ఒకరు ఆబ్సెంట్ కాగా… ఆ విద్యార్ధిను ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్ చేశానని చెప్పాడు. సమ్మెప్ప ఒక విద్యార్థికి చిట్టాలు రాసి పంపాలి.. పేపర్ పంపుఅని అడగడం కారణంగానే… బందెప్ప ఆ పేపర్ ను అతనికి పంపానని చెప్పాడు.