తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య సమాచారం సేకరించేందుకు హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి బీపీ, షుగర్, ప్రాథమిక రక్త,మూత్ర పరీక్షలను చేస్తారు. ఒకవేళ అదనపు పరీక్షలు అవసరమైతే పిహెచ్సి మరియు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లకు పంపిస్తారు.
త్వరలో ప్రారంభం కాబోయే ఈ ప్రాజెక్టు కోసం పరికరాలు మరియు ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తారు. ప్రజల ఆరోగ్య సమాచారం విశ్లేషణతో పాటు క్షేత్రస్థాయిలో వ్యాధిని గుర్తిస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో చికిత్స మరింత సులభం కానుంది. అంతేకాకుండా బిపి, షుగర్ మరియు ఇతర పరీక్షలు ఇంటివద్ద చేయడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందే గుర్తించి చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.