చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆచార్య చాణక్య ఎన్నో విషయాలని చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని లక్ష్మీదేవి వాళ్ళ వెంట ఉండాలని కోరుకుంటారు. కానీ ఇటువంటి ఇంట్లో మాత్రం లక్ష్మీదేవి ఉండదట చాణక్య నీతి ప్రకారం చూసుకున్నట్లయితే పండితులతో స్నేహపూర్వకంగా ఉండాలట జ్ఞానం ఉన్న వ్యక్తి అభిప్రాయాన్ని ఎప్పుడూ కూడా గౌరవించాలి.
అటువంటి వ్యక్తి మాటలను తప్పని చెప్పడం వినకపోవడం మంచిది కాదు. ఒకవేళ కనుక ఇలా మూర్ఖంగా ప్రవర్తించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని ఆచార్య చాణక్య అన్నారు. ఆహారాన్ని చాలామంది ఇంట్లో వృధా చేస్తూ ఉంటారు అటువంటి ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి ఉండదు అలా చేసే వాళ్ళ ఇంట్లో దరిద్రం ఉంటుంది కాబట్టి అసలు ఈ పొరపాటు కూడా చేయకండి.
ప్రశాంతమైన ఆహ్లాదమైన వాతావరణము అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. గొడవలు, గోల ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. మంచి ప్రశాంతకరమైన వాతావరణము ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఉంటుంది. కోపం నిజంగా ఏ మనిషికి కూడా ఉండకూడదు. కోపం అన్నిటిని కూడా నాశనం చేస్తుంది కోపంగా ఉండే వాళ్ళు బాధ్యతలుని మర్చిపోతారు కూడా. కోపంతో ఉంటే కూడా లక్ష్మీదేవి నిలవదు కాబట్టి ఇటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి.