ఏపీ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌..మార్చి నెల జీతాలు మరింత ఆలస్యం !

-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాల అమలు కారణంగా.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి రావడంలేదు. ఒకటో తారీఖు అయ్యాకే పడుతున్నాయి జీతాలు. కొన్ని నెలల్లో మాత్రం.. నెల అయిపోయాక.. 20 వ తేదీన పడుతున్నాయని.. ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. తాజాగా ఏపీ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. ఉగాది పండుగ ఉన్న నేపథ్యంలో.. మార్చి జీతాలు తొందరగా పడి పోతాయని ఆశ పడ్డ ఉద్యోగులకు.. మళ్లీ నిరాశే మిగిలింది. ఇవాళ కూడా జీతాలు పడే ఛాన్స్‌ లేదు.

జీతాల చెల్లింపు కోసం కొత్తగా తయారు చేసిన సాఫ్ట్‌ వేర్‌ పేరోల్‌ వెబ్‌ పనిచేయక పోవడంతోనే.. జీతాలు చెల్లింపులో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ఆర్టీఐకు అనుసంధానం కాకపోవడంతో.. మళ్లీ పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లెక్క ఈ నెల 7 వ తేదీ తర్వాతనే జీతాలు పడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news