విటమిన్ b6 లోపం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా..? అస్సలు లైట్ తీసుకోవద్దు..!

-

అనేక రకాలైనా బీ కాంప్లెక్స్ విటమిన్లు మన శరీర ఆరోగ్యానికి, బలానికి ఉపయోగపడతాయి. కానీ మనం ఈ రోజుల్లో తినే ప్రతీది పాలిష్ చేసిందే అవుతుంది. దీని వల్ల ధాన్యాలలో పై పొరలో ఉండే బీ కాంప్లెక్స్ విటమిన్లు అన్నీ పోతున్నాయి. మనం తినే ఆహారంలో బీ కాంప్లెక్స్ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా B6 శరీరానికి అందదు. b6 శరీరానికి పుష్కలంగా అందిస్తే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, లోపిస్తే ఏం సమస్యలు వస్తాయి, నాచురల్ గా రోజుకు ఎంత కావాలి, ఏ ఏ ఆహారాల్లో ఉంది ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం.

b6 విటమిన్ వల్ల కలిగే ప్రయోజనాలు

ఎర్రరక్తకణాలు సరైన షేపులో తయారవడానికి b6 విటమిన్ చాలా అవసరం. రక్తకణాల లైఫ్ సరిగ్గా లేదంటే.. అవి ప్రయాణించలేవు.

మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనిషి హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అవడానికి b6 కావాలి. ఒకవేళ ఎవరిలో అయితే.. హ్యపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వవో.. మూడ్ స్వింగ్స్ వస్తాయి, మానసిక ఆందోళన పెరుగుతుంది.

రక్షణ వ్యవస్థకు సంబంధించి.. యాంటీబాడీస్ మనలో బాగా ఉత్పత్తికావాలంటే.. b6 కావాలి. బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నప్పుడే.. వైరస్ మీద దాడి చేసి.. మనల్ని రక్షిస్తాయి.

మానం తినే ఆహారంలో ఉండే మాంకసకృతులను బ్రేక్ డౌన్ చేయడానికి కచ్చితంగా b6 కావాలి.

పీల్చేగాలి ద్వారా వచ్చే పొల్యూషన్ లోపలికి వెళ్లి గాలితిత్తులను డామేజ్ చేస్తుంది. ఇవి డామేజ్ అవకుండా.. వాటి లైఫ్ పెంచడానికి కూడా విటమిన్ b6 కావాలి.

మన బాడిలో హోమోసిస్టిన్( Homocysteine)అనేదాన్ని బ్రేక్ డౌన్ చేసి ప్రొటీన్ ప్రొడెక్షన్ తయారీకీ బాగా b6 ఉపయోగపడుతుంది. హోమోసిస్సిటన్ పెరగడం గుండె ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.

ఇలాంటి ప్రధాన లాభాలు b6 వల్ల ఉన్నాయి. ఒకరోజుకు పెద్దలకు కావాల్సిన b6 విటమిన్ 2 మిల్లీ గ్రాములు, అదే గర్భీణీలకు, బాలింతలకు అయితే 2.6 మిల్లీ గ్రాములు ఒక రోజుకు కావాలి. ఇది వాటర్ సాలిబుల్ విటమిన్ కాబట్టి ఏరోజుకు ఆరోజు అందించాల్సిందే.

విటమిన్ b6 ఉండే ఆహారాలు:

పాలిష్ పట్టని చిరుధాన్యాలలో ఉంటుంది. వీటికంటే ఎక్కువగా విత్తనాల్లో ఉంటుంది. 100 గ్రాముల విత్తనాల్లో b6 ఎంతెంత ఉంటుందంటే..

వేరుశనగపప్పులు 300 మిల్లీగ్రాములు
రాజ్మా 400 మిల్లీగ్రాములు
సోయాచిక్కుడు 400 మిల్లీ గ్రాములు
నువ్వులు 800 మిల్లీగ్రాములు
పొద్దుతిరుగుడు గింజలు 1.3 మిల్లీగ్రాములు
పిస్తాపప్పు 1.7 మిల్లీగ్రాములు

వీటన్నింటిలో b6 పుష్కలంగా ఉంది. అయితే.. ఇవన్నీ కూడా నానపెట్టుకుని తినటం వల్లే మంచి ప్రయోజనాలు ఉంటాయి. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఉదయం వేరుశనగలు, నువ్వులు నానపెట్టుకుని తినొచ్చు. కూరల్లో ఉడకపెట్టిన సోయాచిక్కుడు, రాజ్మా వాడుకోవచ్చు. సాయంత్రం పొద్దుతిరుగుడు గింజలు, పిస్తాపప్పులు బరువు కంట్రోల్ లో ఉండటంతో పాటు.. బాడీకి కావాల్సిన b6 కూడా అందుతుంది. పిల్లలకు ఇలాంటివి పెడితే.. మూడ్ స్వింగ్స్ లేకుండా ఉంటారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news