వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టుకు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ హాజరయ్యారు. ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను పెట్టారా అని హైకోర్టు ప్రశ్నలు వేసింది. లబ్దిదారుల ఎంపిక బాధ్యత వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారన్న హైకోర్టు… గతంలో లబ్దిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా అని ప్రశ్నించింది.
వాలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించిన హైకోర్టు…సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని తెలిపింది. వాలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారన్న హైకోర్టు..చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సేవలను రెగ్యులరైజ్ చేయాలనీ తెలిపింది. శాశ్వత ఉద్యోగులుగా చేసి సర్వీస్ రూల్స్ రూపొందించాలన్న హైకోర్టు… లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక విచారణ మార్చి 10కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.