సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై, హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి చైత్ర కుటుంబసభ్యులను ఈ రోజు ఉదయం ములుగు శాసనసభ్యురాలు సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మందు, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని అని అన్నారు. వాటివల్లనే ఇలాంటి అఘాయిత్యాలు పెరుగుతున్నాయని సీతక్క సీరియస్ అయ్యారు అభం శుభం తెలియని చిన్నారి నరరూప రాక్షసుడి చేతిలో బలికావడం బాధను కలిగిస్తుందని సీతక్క వ్యాఖ్యానించారు.
నిందితుడి కి వెంటనే కఠిన శిక్ష ను విధించాలని సీతక్క డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని సీతక్క అన్నారు. ఆ దుర్మార్గుడిని బహిరంగంగా ఉరితాయాలంటూ సీతక్క వ్యాఖ్యానించారు. వాడిని బయటకు తీసుకురావాలని రాళ్లతో కొట్టాలో..ఉరితీయాలో నిర్ణయం తీసుకోవాని అన్నారు. మెజిస్ట్రేట్ కు ఫోన చేసి వెంటనే నింధితుడికి కఠినంగా శిక్ష వేయాలని సీతక్క అన్నారు. పోలీసులు బాధిత కుటుంబం పైనే మళ్లీ దాడి చేశారని సీతక్క ఆరోపించారు.