అన్నదాతల కోసం కేంద్రం ఎన్నో స్కీములని తీసుకు వస్తోంది. ఈ స్కీముల వలన రైతులకి చాలా రకాల బెనిఫిట్స్ అందుతున్నాయి. రైతుల కోసం కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం కిసాన్ ఒకటి. ఇప్పటికి పన్నెండు విడతల డబ్బులు వచ్చాయి.
పదమూడవ విడత డబ్బులు అన్నదాతలకు త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలోకి రానున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. వచ్చే వారం లో ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ కావచ్చని తెలుస్తోంది. ఈ డబ్బులు జనవరి 15 కల్లా రైతులు ఖాతా లో పడతాయి. ఇది కనుక జరిగితే సంక్రాతి కి రైతులకి ఈ డబ్బులు అందుతాయి.
ఇప్పటి దాకా సర్కార్ 12 విడతల డబ్బులను ఇచ్చింది. ఇప్పుడు మరో రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లోకి రానున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు అందిస్తున్నారు. అంటే మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున ఈ డబ్బులు పొందొచ్చు. అయితే ఈ డబ్బులని పొందాలంటే ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే డబ్బులు రావు. కనుక ఇకేవైసీ తప్పనిసరి. కనుక ఇకేవైసీ ని తప్పక పూర్తి చేసుకోవాలి.