విడదల రజినీకి మరోషాక్‌..ఆమెకు మంత్రి ఇవ్వద్దని సీఎం జగన్‌ కు లేఖ

-

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీకి మరో షాక్‌ తగిలింది. ఆమెకు మంత్రి ఇవ్వద్దని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ కు మరో లేఖ రాశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని రజక సామాజిక వర్గం కాదని రజక సంఘాల ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

ఈ సందర్భంగా బీసీ రజక ఐక్య వేదిక సభ్యులు కె. వెంకటేశ్వర రావు, శేషగిరిరావు మాట్లాడుతూ… విడదల రజని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మహిళ అని ఆరోపించారు. రజక కులం అని జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాదయాత్ర సమయంలో రజక కులానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ముదిరాజ్ కులానికి రజక పేరు మీద మంత్రి పదవి ఇస్తే భవిష్యత్తులో మాకు రావాల్సిన ఎమ్మెల్సీ పదవి రాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే విడదల రజినీకి ఇవ్వకూడదని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news